PRABANJANAM
Date of Publish : 05 August 2026, 1:01 pm Posted by : Prabanjanam News

ఫెస్ట్ వివాదం.. జూనియర్ పై సీనియర్ల దాడి సూచన

  • ముక్కు ఎముక విరగడంతో శస్త్రచికిత్సకు వైద్యుల సూచన.
  • సీనియర్లతో పాటు కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు

ఎల్బీనగర్,(ప్రభంజనం): ఫెస్ట్‌ కు సంబంధించిన చర్చ నేపథ్యంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. చైతన్యపురి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… సరూర్‌నగర్‌కు చెందిన అఖిల్​తేజ (17) కొత్తపేటలోని ఫిజిక్స్ వాలా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్​ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ చర్చ సందర్భంగా సీనియర్లు జూనియర్లను వేధించారు. అనంతరం కాలేజీ సమీపంలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు అఖిల్​ తేజపై పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనలో విద్యార్థికి ముక్కు ఎముక విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అఖిల్​తేజ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.