PRABANJANAM
Date of Publish : 07 August 2026, 12:57 pm Posted by : Prabanjanam News

హైడ్రాలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాలు..10వ తరగతి పాసైతే చాలు

  • నేడు, రేపు ఫిజికల్ టెస్ట్‌లు
  • 10వ తరగతి అర్హతతో డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టుల భర్తీ
  • సరూర్‌నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ

హైదరాబాద్ బ్యూరో,(ప్రభంజనం):  నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. హైడ్రా పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన (కాంట్రాక్ట్ పద్ధతిలో ) మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఖాళీల వివరాలు:

  •  డీఆర్ఎఫ్ అసిస్టెంట్: 100 పోస్టులు
  •  హెవీ వెహికల్ డ్రైవర్: 50 పోస్టులు

అర్హతలు, వయోపరిమితి:

విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10వ తరగతి (ఎస్సెస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

ప్రత్యేక అర్హత: హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఫిజికల్ టెస్ట్ (దేహ దారుఢ్య పరీక్షలు):

  • అభ్యర్థులకు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలు కింది విధంగా ఉంటాయి:
  • 800 మీటర్ల పరుగు పందెం: 2 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేయాలి.
  • 100 మీటర్ల పరుగు పందెం: 15 సెకన్లలో పూర్తి చేయాలి.
  • లాంగ్ జంప్: కనీసం 4 మీటర్లు దూకాలి.
  • షాట్‌పుట్: 7.26 కిలోల బరువును 6 మీటర్ల దూరం విసరాలి.

తేదీలు మరియు వేదిక:

  •  ఫిజికల్ టెస్ట్ తేదీలు: ఆగస్టు 8, 9 (ఇవాళ,రేపు)
  •  సమయం: ఉదయం 5:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
  •  వేదిక: సరూర్‌నగర్ ఇండోర్/అవుట్‌డోర్ స్టేడియం, హైదరాబాద్.

కావాల్సిన పత్రాలు:

అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఈ క్రింది ధ్రువపత్రాలను వెంట తీసుకువెళ్లాలి:

  •  10వ తరగతి ఒరిజినల్ మార్కుల మెమో
  •  ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ మొదలైనవి)
  •  పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  •  డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుదారులు ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా సమర్పించాలి.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సూచించిన తేదీల్లో నిర్ణీత సమయానికి అన్ని ధ్రువపత్రాలతో సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని అధికారులు సూచించారు.