మియాపూర్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు మహ్మద్ నజీర్ మియాకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్ నజీర్ మియా (57), నగరానికి వలసవచ్చి హఫీజ్ పేట్ మార్తాండ నగర్‌లో నివాసం ఉంటూ కిరాణా షాప్ నడుపుతున్నాడు. 2023...