జేఎన్‌టీయూహెచ్‌లో ముగిసిన 30 రోజుల విద్యుత్ వాహనాల శిక్షణ
కూకట్ పల్లి(ప్రభంజనం): ఎలక్ట్రిక్ వాహన రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీ – సిమ్యులేషన్ నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్ సమీకరణ వరకు” అనే అంశంపై నిర్వహించిన 30 రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ పరిశ్రమ పరస్పర సహకార కేంద్రం (యూఐఐసీ)లో నిర్వహించిన వాలెడిక్టరీ కార్యక్రమంతో విజయవంతంగా ముగిసింది. ఐఈఈఈ పవర్ అండ్ ఎనర్జీ సొసైటీ (పీఈఎస్) / పవర్ ఎలక్ట్రానిక్స్ సొసైటీ (పీఈఎల్ఎస్) / ఇండస్ట్రీయల్ అప్లికేషన్స్ సొసైటీ (ఐఏఎస్) హైదరాబాద్ సెక్షన్ జాయింట్ చాప్టర్ మరియు...