PRABANJANAM
Date of Publish : 15 August 2026, 12:30 pm Posted by : Prabanjanam News

అల్వీన్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • జాతీయ జెండా ఎగరవేసిన కాంగ్రెస్ నాయకుడు పట్వారీ శశిధర్

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాన్ని అందించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, ఎన్ ఎస్ యూఐ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.