- జాతీయ జెండాను ఆవిష్కరించిన టీఆర్ఎస్ ఇంఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) ఇంఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదీనాగూడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద, అలాగే మక్తా మహబూబ్ పేట్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగరవేశారు.అనంతరం వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల సుదీర్ఘ పోరాటాలు, లెక్కలేనన్ని ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తుచేశారు. దేశ విముక్తి కోసం పోరాడిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఆయన పాదాభివందనాలు సమర్పించారు. దేశభక్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండె దయానంద్, సురేష్ శంకరొళ్ల, గుండె లక్ష్మి, ప్రభు, విష్ణు, కుమార్, మురుగేసన్, ప్రవీణ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు.