ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన టీఆర్ఎస్ ఇంఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) ఇంఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదీనాగూడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద, అలాగే మక్తా మహబూబ్ పేట్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగరవేశారు.అనంతరం వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల సుదీర్ఘ పోరాటాలు, లెక్కలేనన్ని ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం...