మియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన పీఏసీ ఛైర్మెన్ గాంధీ శేరిలింగంపల్లి (ప్రభంజనం): మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండావందనం సమర్పించారు. అనంతరం ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, తాజామాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా...