90 ఏళ్ల లెక్కల చిక్కుముడి.. గంటల్లో విప్పేసిన ఓపెన్ ఏఐ!

ఇంటర్నేషనల్ డెస్క్ (ప్రభంజనం): మనిషి మేధస్సుకు మాత్రమే సాధ్యమని భావించిన గణిత శిఖరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తాకింది. దశాబ్దాలుగా ప్రపంచ మేటి గణిత శాస్త్రవేత్తలకే సవాలుగా నిలిచిన ఓ అపరిష్కృత మిస్టరీని ఓపెన్ ఏఐ టెక్నాలజీ కేవలం 88 గంటల్లో ఛేదించినట్లు ప్రకటించింది. గణిత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘మిలీనియం ప్రైజ్ ప్రాబ్లమ్స్’లో ఒకటైన 90 ఏళ్ల నాటి ‘నేవియర్-స్టోక్స్’ సమస్యను తమ అంతర్గత ఏఐ మోడల్ పరిష్కరించిందని వెల్లడించడంతో ఒక్కసారిగా ప్రపంచం విస్మయానికి గురైంది. అయితే, ఈ పరిష్కారాన్ని స్వతంత్ర గణిత...