PRABANJANAM
Date of Publish : 22 September 2026, 1:35 pm Posted by : Prabanjanam News

యాదాద్రి కొండపై కారు ఢీకొని యాచకురాలు మృతి..

  • కొండపై వాహనాల ఓవర్ స్పీడ్ తగ్గించాలని భక్తుల డిమాండ్

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 22 (ప్రభంజనం):

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యాచకురాలు మృతి చెందింది. కొన్నేళ్లుగా కొండపైనే ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న మహిళను ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వారు హైదరాబాద్ కు చెందిన భక్తులుగా పోలీసులు గుర్తించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొండపై వాహనాల వేగాన్ని నియంత్రించి, భక్తులు, స్థానికుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.