దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్లపై ‘తెలంగాణ టైగర్’ పేరుతో కారు హల్చల్‌..నెంబర్‌ ప్లేట్‌ స్థానంలో సీఎం పేరు..!

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నా పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు కారు వెనుక అడ్వకేట్‌ సింబల్‌.. వాహనదారుల్లో చర్చ హైదరాబాద్: నగరంలోని రద్దీ ప్రాంతమైన దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్లపై ఓ కారు సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ, ఎలాంటి నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ఈ వాహనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కారు నెంబర్‌ ప్లేట్‌ ఉండాల్సిన చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ‘తెలంగాణ టైగర్’ అనే పేరును ముద్రించి హల్చల్ చేస్తుండటం ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అసలేం జరిగిందంటే..? దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన...