మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి చేయాలి
అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్, (ప్రభంజనం): మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్తీ కల్లు తయారీలో వినియోగించే ఆల్ఫ్రాజోలం వంటి పదార్థాలపై నిఘా పెంచాలని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల నివారణకు నిరంతర తనిఖీలతో పాటు ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. మత్తు పదార్థాల నివారణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ కోరారు....