Jeedimetla: కుత్బుల్లాపూర్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

13 దుకాణాల చోరీ కేసులు ఛేదించిన జీడిమెట్ల పోలీసులు మేడ్చల్ ( ప్రభంజనం ):  కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో రాత్రి వేళల్లో మూసివేసిన వాణిజ్య దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జీడిమెట్ల పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 13 చోరీ కేసులు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 5-6 మధ్య రాత్రి చింతల్ మెయిన్ రోడ్డులోని గణేష్‌నగర్‌లో ఉన్న ఐనత్ గ్లాస్ అండ్ ప్లైవుడ్ షాప్...