నాంపల్లి మండల కేంద్రంలో శాశ్వత బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలి

ప్రజావాణిలో సామాజిక వేత్త కర్నాటి శ్రీహరి వినతి మునుగోడు ఆగస్టు 17 (ప్రభంజనం) నాంపల్లి మండల కేంద్రంలో శాశ్వత బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక వేత్త కర్నాటి శ్రీహరి సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడీఓ ) రామకృష్ణ శర్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కర్నాటి శ్రీహరి మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో ప్రత్యేకమైన బస్‌స్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాలకు ప్రధాన...