హాస్టల్ భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి
అంజయ్య నగర్ లో ఘటన శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) హాస్టల్ భవనం పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు (38) కొంతకాలంగా అంజయ్య నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో హాస్టల్ భవనం పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం...