ప్రియుడి ఇంటి ఎదుట గర్భిణి యువతి ఆందోళన

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆందోళన  సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ గర్భిణి యువతి గురువారం పటాన్‌చెరు పట్టణంలోని నాయకోటి బస్తీలో ప్రియుడు శ్రావణ్ ఇంటి ముందు నిరసనకు దిగింది. లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయమైన శ్రావణ్ ప్రేమ పేరుతో తనను నమ్మించి, ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిని చేసి వివాహానికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు అరుణ ఆరోపించింది.ఈ ఘటనపై ఇప్పటికే పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి...