శ్రీచైతన్య పాఠశాలలో ర్యాగింగ్ భూతం.. పదో తరగతి విద్యార్థిపై అమానుష దాడి

కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కిన సీనియర్లు మెట్లపై పడి జారిపడ్డాడంటూ బుకాయించిన యాజమాన్యం దమ్మాయిగూడలో ఘటన.. విషమంగా బాధితుడి పరిస్థితి పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి తల్లిదండ్రులు మేడ్చల్ (ప్రభంజనం): ప్రఖ్యాత విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతకు ఏపాటి రక్షణ ఉంటోందో చెప్పడానికి మరో దారుణ ఉదంతం మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో సీనియర్ విద్యార్థుల రాక్షస క్రీడ బట్టబయలైంది. తోటి విద్యార్థిపై ‘ర్యాగింగ్’ పేరుతో కొందరు సీనియర్లు మూకుమ్మడిగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితికి...