అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుస భూకంపాలు.. అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు
ప్రభంజనం డెస్క్ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భూమి మరోసారి కపించింది. రాష్ట్రంలోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్ ) వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5.45 గంటలకు అప్పర్ సియాంగ్ జిల్లాలోని పాంగిన్ కు 116...