ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని మాధవరం కాంతారావు పిలుపు కూకట్‌పల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ నిజామాబాద్‌ జిల్లా, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో హర్‌ ఘర్‌ తిరంగా జిల్లా కో-కన్వీనర్‌ తోట రమేష్‌,...