సమృద్ధిగా వర్షాలు, పాడిపంటలు.. భవిష్యవాణిలో కె. అనురాధ
ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో వైభవంగా రంగం హైదరాబాద్ : ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు జంగం మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు నగరం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా మాతంగి స్వరూపిణి కె. అనురాధ పచ్చి భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి నివేదనతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు...