ఇంటర్ బోర్డు ముట్టడించిన ఏబీవీపీ..ఫేక్ ఫైర్ ఎన్ ఓసీలు విషయంలో ధర్నా

హైదరాబాద్(ప్రభంజనం): ఫేక్ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించి ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు పొందేందుకు ప్రయత్నించిన ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP ) ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వి తేజ మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు అనుమతుల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు సమర్పించడం తీవ్ర ఆందోళనకరమని ఆరోపించారు. ఈ...