పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల పాండురంగరావు సిటీ బ్యూరో: ( ప్రభంజనం ) తెలంగాణ రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పట్టభద్రుల ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ ప్రారంభమైనందున, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యులు గొట్టుముక్కల పాండురంగరావు కోరారు. రాష్ట్రంలోని మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు తాజా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు....