Telangana Assembly: కాంగ్రెస్ హామీల అమలుపై అసెంబ్లీలో నిలదీస్తాం :బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది తెలంగాణ బ్యూరో ( ప్రభంజనం ): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ శాసనసభాపక్షం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు...