PRABANJANAM
Date of Publish : 24 August 2026, 2:55 pm Posted by : Prabanjanam News

పార్టీ జెండా గద్దె నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి

  • టీఆర్ పీ నాయకుల వినతి

జుక్కల్ 🙁 ప్రభంజనం )

జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దె ఏర్పాటు కోసం అనుకూలమైన స్థలం కేటాయించి అనుమతి మంజూరు చేయాలని కోరుతూ పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ కు ప్రజల రాకపోకలకు, ఇతర పౌర సౌకర్యాలకు ఎటువంటి భంగం కలగకుండా జెండా గద్దెను ఏర్పాటు చేసుకుంటామని, అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి సంబంధిత స్థలాన్ని పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్ ఈశ్వర్, ఖండేరావు, రాజ్పాల్, మిలింద్ పాల్గొన్నారు.