- భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సిరికొండ, (ప్రభంజనం):
సిరికొండ మండలం పెద్ద వాల్గోట్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి షేక్ పర్వీన్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆధార్ కార్డు, పదో తరగతి మెమోతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన చివరి తేదీని పాఠశాల అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు.