చంపాపేట్ కుమ్మరి బస్తీలో దారుణం.. చావు ఖర్చుల వివాదంతో అన్న హత్య
హైదరాబాద్ క్రైమ్ బ్యూరో : తండ్రి అంత్యక్రియలు, ఇతర చావు ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేసి హతమార్చిన ఘటన మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి చంపాపేట్ కుమ్మరి బస్తీలో శనివారం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం.. ముదావత్ వెంకటేష్ (28) గత ఐదేళ్లుగా కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి మృతి అనంతరం అతని తమ్ముడు శివ (26) కూడా అన్న వద్దకు వచ్చి అదే ప్రాంతంలో...