బాబోయ్.. ఎకరం రూ.264 కోట్లు!

రాయదుర్గంలో ఆల్‌టైమ్ రికార్డు ధర గత రికార్డులు బ్రేక్ హైదరాబాద్ బ్యూరో: ( ప్రభంజనం ) హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూమి ధర కొత్త రికార్డు సృష్టించింది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. దీంతో హైదరాబాద్‌లో ఎకరా భూమి ధరకు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల ప్లాట్‌ (పి1)కు శుక్రవారం ఈ-వేలం నిర్వహించారు. ఎకరాకు రూ.175 కోట్ల...