- హాజరైన అధికారులు, బిడ్డర్లు
హైదరాబాద్ బ్యూరో( ప్రభంజనం ) : బాచుపల్లి లేఅవుట్‌లోని (35) నివాస ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( హెచ్ఎండీఏ) గురువారం బాచుపల్లి లేఅవుట్‌లో ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా ఆసక్తి గల బిడ్డర్లకు వేలం ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సమావేశానికి హెచ్ ఎండీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సత్య ప్రసాద్, డీఈఏ, ఎస్టేట్స్ విభాగం తహసీల్దార్, వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి అలాగే ఈ-వేలం నిర్వహణ కోసం హెచ్ ఎండీఏ ద్వారా నియమించబడిన ఎంఎస్ టీసీ సంస్థ ప్రతినిధులు, ట్రాన్సాక్షన్ అడ్వైజర్లుగా వ్యవహరిస్తున్న కేపీఎంజీ బృంద సభ్యులు భారీ సంఖ్యలో ఆసక్తి గల బిడ్డర్లు హాజరయ్యారు. ఆసక్తి గల బిడ్డర్లతో పరస్పరం చర్చించి, నివాస ప్లాట్లు, లేఅవుట్ వివరాలు, అభివృద్ధి, మౌలిక వసతులు, ఈ-వేలం నిబంధనలు, షరతులు తదితర అంశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.
ముఖ్యమైన వేలం తేదీలు
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 31.08.2026
ఈ-వేలం తేదీ: 02.09.2026
హెచ్ ఎండీఏ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్: 7416835522