బాచుపల్లి లేఅవుట్‌లోని నివాస ప్లాట్ల ఈ-వేలానికి ప్రీ-బిడ్ సమావేశం
హాజరైన అధికారులు, బిడ్డర్లు హైదరాబాద్ బ్యూరో( ప్రభంజనం ) : బాచుపల్లి లేఅవుట్‌లోని (35) నివాస ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( హెచ్ఎండీఏ) గురువారం బాచుపల్లి లేఅవుట్‌లో ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా ఆసక్తి గల బిడ్డర్లకు వేలం ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి హెచ్ ఎండీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సత్య ప్రసాద్, డీఈఏ, ఎస్టేట్స్ విభాగం తహసీల్దార్, వెంకటేశ్వర్లు,...