బోనాల వేడుకల్లో ఘోరం.. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి…
తెల్లాపూర్ ‘శిఖరం’ ప్లే స్కూల్‌లో తీవ్ర విషాదం.. స్కూల్ నుంచి బయటకొచ్చి ‘మేళ్ల చెరువు’లో పడ్డ షణ్ముఖ్... కొడుకు దూరం కావడంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు.. పటాన్ చెరు,(ప్రభంజనం): పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఉదయాన్నే నవ్వుతూ స్కూలుకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు, కొద్ది గంటల్లోనే చెరువులో శవమై తేలిన విషాద సంఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.వివరాల్లోకి వెళ్తే తెల్లాపూర్ లోని ‘శిఖరం’ ప్లే స్కూల్‌లో ఆరేళ్ల బాలుడు షణ్ముక్...