సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిపై దుష్ప్రచారం..!
రోగి మృతి ఘటనపై మెడికవర్ డాక్టర్ల విచారం.. వాస్తవాలను వెల్లడించిన యాజమాన్యం తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి విజ్ఞప్తి సికింద్రాబాద్,(ప్రభంజనం): సికింద్రాబాద్లోని మెడికవర్ ఆసుపత్రిలో యువ రోగి మృతి ఘటనకు సంబంధించి గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వైద్యపరమైన వివరాలను మీడియా ముందు వెల్లడిస్తూ.. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను కోరనున్నట్లు వెల్లడించింది....