విడియా, ఎఫ్‌సీఐ కాలనీల్లో అధ్వానంగా రోడ్లు

వర్షం పడితే బురదమయంగా మారుతున్న రహదారులు అంబులెన్స్, స్కూల్ విద్యార్థులకు ఇబ్బందులు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మియాపూర్‌లోని విడియా, ఎఫ్‌సీఐ కాలనీల్లో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా రహదారులన్నీ బురదమయంగా మారడంతో కాలనీవాసులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలనీలో అంబులెన్స్ బురదలో ఇరుక్కుపోయిన ఘటన చోటుచేసుకోవడంతో పరిస్థితి తీవ్రత స్పష్టమైంది. అలాగే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బురదలో జారిపడిన సంఘటనలు...