పోచారంలో హైస్కూల్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న కాంగ్రెస్ నాయకులు ఘట్కేసర్: (ప్రభంజనం) ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్, పోచారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నూతన పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం మల్లిఖార్జున్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, పాఠశాల ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నూతన భవన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బద్దం...