- స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం
యాదగిగుట్ట: (ప్రభంజనం)
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆలేరు నియోజకవర్గ ప్రజలపై రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.