చెరువుగట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బీర్ల అయిలయ్య
స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం యాదగిగుట్ట: (ప్రభంజనం) నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని,...