గణనాథుడికి బీఆర్‌ఎస్ నేత వినూత్న వినతి.. అక్రమాల విముక్తికై మహాగణపతికి అర్జీ!

కూకట్ పల్లి,( ప్రభంజనం): మహాగణపతి నవరాత్రి ఉత్సవాల వేళ విఘ్నేశ్వరుడి సాక్షిగా రాజకీయ నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవకతవకల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ నేత ఏకంగా మహాగణపతికే వినతిపత్రం సమర్పించారు. గణనాథుడి ముందు అర్జీ పెట్టుకున్న ఈ వినూత్న నిరసన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భూలోకానికి విచ్చేసిన విఘ్నేశ్వరుడు ప్రజల కష్టాలను తొలగించి రాష్ట్రాన్ని కాపాడాలని రఘునందన్ నేత వేడుకున్నారు. తెలంగాణ...