BRS LP Meeting: ఎర్రవెల్లిలో 6న బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. అసెంబ్లీ వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ శాసనసభా పక్ష (BRSLP) సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సంయుక్త సమావేశం జరగనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన...