PRABANJANAM
Date of Publish : 07 August 2026, 2:35 pm Posted by : Prabanjanam News

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్:(ప్రభంజనం): కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మహిళలు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.