- రూ. 200 కోట్ల విలువైన ప్రజా భూముల ధారాదత్తం
- బినామీ లావాదేవీలు, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం
- 13 కీలక ఆధారాలతో లోకాయుక్తలో ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ బ్యూరో,( ప్రభంజనం ):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న మెసర్స్ టెస్సరా క్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో సుమారు రూ. 135 కోట్ల నుండి రూ. 200 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 5 ఎకరాల అత్యంత విలువైన ప్రజా భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడంపై భారత రాష్ట్ర సమితి ( బీఆర్ ఎస్) ప్రజా ప్రతినిధుల బృందం తెలంగాణ లోకాయుక్త వద్ద అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీ లు డా. దాసోజు శ్రవణ్ కుమార్, మంకెన కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డా. సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డా. మన్నె క్రిశాంక్ స్వయంగా సమర్పించారు.