బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అతివేగమే కారణమా ..? దుబ్బాకలో విషాద ఘటన దుబ్బాక (ప్రభంజనం): అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (33) ఇసుక వ్యాపారం చేస్తూ భార్య భాగ్యలక్ష్మి (25), కుమారుడు నేహాన్స్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి ఉంటున్నారు. ఇటీవల సిద్దిపేటలో...