PRABANJANAM
Date of Publish : 12 September 2026, 4:19 pm Posted by : Prabanjanam News

ఢీ20 టీవీ షో విన్నర్ రాజుపై కేసు..

  • యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు..
  • అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

ఢీ డ్యాన్స్ షో ద్వారా పేరుతెచ్చుకున్న ఢీ 10, ఢీ 20 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువతిని లైంగికంగా వేధించాడంటూ రాజుపై ఆరోపణలు రావడంతో మియాపూర్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది.