కీసరలో చైన్ స్నాచింగ్..

వృద్ధురాలి మెడలో నుండి బంగారు గొలుసు అపహరణ కీసర: ( ప్రభంజనం ) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారం అన్నపూర్ణ కాలనీలో చైన్‌ స్నాచింగ్‌ ఘటన చోటుచేసుకుంది. శకుంతల (68) అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు అవసరమైన వస్తువులను సర్దుకుంటున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో బాధితురాలు...