PRABANJANAM
Date of Publish : 11 September 2026, 10:12 am Posted by : Prabanjanam News

తొలి భూ పోరుకు నాంది చాకలి ఐలమ్మ..

  • ఘన నివాళులర్పించిన నాయకులు

కీసర : ( ప్రభంజనం )

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ రెడ్డి అన్నారు.
కీసర రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం కీసరలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, ఆనాటి దేశ్ ముఖ్ లపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ ప్రజాప్రతినిధులు రజక సంఘం నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.