నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని బాలింత ఆత్మహత్య

ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య! నల్గొండ: ( ప్రభంజనం ) వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాల నేపథ్యంలో ఓ బాలింత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన మమత (32 ) ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. మమతకు వారం రోజుల క్రితమే ప్రసవం జరిగింది. ఆమెకు వరుసగా నాలుగోసారి...