ఢిల్లీ మెట్రోలో మహిళ ఫొటో తీసిన సీఐఎస్ ఎఫ్ జవాన్?
సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కొనసాగుతున్న శాఖాపరమైన విచారణ న్యూఢిల్లీ: ( ప్రభంజనం ) ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను తన మొబైల్ ఫోన్‌తో ఫొటో తీశాడన్న ఆరోపణలపై సీఐఎస్ ఎఫ్ జవాన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తనను సీఐఎస్ ఎఫ్ జవాన్ ఫొటో తీశాడని అనుమానించిన మహిళ.. ఫోన్ చూపించాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఫొటోను డిలీట్ చేయాలని...