సుభాష్ నగర్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన పర్యటన
పౌర సమస్యలపై అధికారులతో సమీక్ష సైబరాబాద్ (ప్రభంజనం): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ శ్రీజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి బుధవారం సుభాష్ నగర్ వార్డును సందర్శించి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై స్థానిక పౌర సమస్యలు, అవసరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రధానంగా డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, దెబ్బతిన్న, మరమ్మతులు అవసరమైన రోడ్లు, పార్కుల అభివృద్ధి, పారిశుధ్యం, నిర్మాణ కూల్చివేతల వ్యర్థాల తొలగింపు, అలాగే దోమల...