మాజీ మంత్రి హరీష్‌రావుపై ఉస్మానియా పీఎస్‌లో ఫిర్యాదు
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు (Harish Rao)పై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ (OU) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి వెళ్లిన ఆయన, తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా హరీష్‌రావు క్షుద్ర పూజలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం చనగాని దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా, ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే...