- హామీల పేరుతో అడుగడుగునా మోసమే!
- బీఆర్ ఎస్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి
కీసర: ( ప్రభంజనం )
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఇది మైలురాయి కాదు, ప్రజలను మోసం చేసిన వెయ్యి రోజుల ద్రోహం అని అన్నారు బీఆర్ ఎస్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి.
రైతు భరోసా పేరుతో వారిని వంచించిందని, రైతు బీమా పథకం రద్దు. రుణమాఫీ పేరుతో 25 లక్షల మందిలో సగం మందికే మాఫీ చేశారని దుయ్యబట్టారు. నెలకు రూ.2,500, స్కూటీలు, అంగన్ వాడీలకు రూ.18,000 జీతం – ఒక్కటీ అమలు కాలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.4,000 – గాలికి వదిలేశారని, యూరియా కొరత, పరీక్ష పేపర్ లీకులతో విద్యార్థులు రోడ్డున పడ్డారని, వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన అడుగడుగునా విఫలం అయ్యిందని, 420 హామీలు ఇచ్చి, భ్రమల్లో విహరింపజేసి.. ప్రజలను రోడ్డున పడేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.