- ఒకరికొకరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి
హనుమకొండ, (ప్రభంజనం): కాంగ్రెస్ అంటేనే జాతీయ పార్టీ. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొత్తవి కావు అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఒకరికొకరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. అవి పరిమితులు దాటితే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు, కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా అందరికీ డబుల్, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.