PRABANJANAM
Date of Publish : 12 August 2026, 8:45 am Posted by : Prabanjanam News

ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్​లో కానిస్టేబుల్‌ సూసైడ్

  • రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకున్న సాయికుమార్‌
  • ఈ-కాప్స్‌ డ్యూటీ కోసం ఇటీవల ఏసీపీ ఆఫీస్​కు అటాచ్‌

ఎల్బీనగర్‌( ప్రభంజనం ): తాను పనిచేస్తున్న కార్యాలయంలోని రెస్ట్ రూంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జె. సాయికుమార్‌ (13128) బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయనను దగ్గరలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. సాయికుమార్‌ 2024 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఈ-కాప్స్‌ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. సాయికుమార్ కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.